Palvancha: భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు - భక్తులతో కిటకిటలాడిన పాల్వంచ దేవాలయాలు

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసి, నాగదేవతకు పాలు పోశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 Nov 2026 3:05 PM IST
Palvancha
X

Palvancha: భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు - భక్తులతో కిటకిటలాడిన పాల్వంచ దేవాలయాలు

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో నాగుల చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్తీక శుద్ధ చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు, ముఖ్యంగా మహిళలు పుట్టల వద్దకు చేరుకుని పాలు, పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పిల్లల ఆరోగ్యం, కుటుంబ క్షేమం, సంతాన భాగ్యం కోసం భక్తులు మొక్కులు చెల్లించుకుని, పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేసి, దీపాలు వెలిగించారు.

ఈ సందర్భంగా పాల్వంచలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో నాగ ప్రతిష్టలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN