Palwancha: పాల్వంచ గిరిజన బాలికల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 Nov 2026 7:54 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ గిరిజన బాలికల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం!

పాల్వంచ: బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారుతూ స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల పాల్వంచలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. చెన్నారావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారుతూ స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ బాధ్యతలను చేపట్టారు. సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల స్థానంలోకి వచ్చి తోటి విద్యార్థులకు, చిన్న తరగతుల వారికి పాఠాలు బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెచ్.డబ్ల్యు.ఓ, అటెండర్, ఇతర సిబ్బంది పాత్రలను కూడా విద్యార్థులే నిర్వహిస్తూ పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వయంగా అనుభూతి చెందారన్నారు.

పరిపాలన విధానం, బాధ్యతాయుత ప్రవర్తన, ఉపాధ్యాయుల కష్టాన్ని తెలుసుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ఈ వేడుక ప్రధాన ఉద్దేశం అని అన్నారు. బాలల దినోత్సవానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. బాలల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు.

ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో చైల్డ్ వెల్ఫేర్ అవేర్నెస్ రూప బృందం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బాలల దినోత్సవ సందర్భంగా తమ అమూల్యమైన సందేశాన్ని అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. కిషన్, కే. సురేష్, వి. రఘు, బి. అనూష, యం. గంగా, పి. ఆదిలక్ష్మి, ఐ. సరస్వతి, హెచ్.డబ్ల్యు.ఓ ఏ. కళ్యాణి, ఇ. జ్యోతి, పి. కళావతి తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN