Palvancha: లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండ పొంగులేటి
Palvancha: పాల్వంచలో స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా.
Palvancha: లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండ పొంగులేటి
పాల్వంచ: స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం పాల్వంచలోని లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లిన మంత్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు చట్టప్రకారం కొనసాగుతోందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, పట్టణ డీఎస్పీ సతీష్, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఊకంటి గోపాలరావు, తహసీల్దార్ దారా ప్రసాద్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, మండల అధ్యక్షుడు భువన సుందర్ రెడ్డి, పెద్దమ్మతల్లి ఆలయ మాజీ అధ్యక్షుడు మహిపతి రామలింగం, కార్పొరేటర్ బాలు నాయక్, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు గుండు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.




