Palvancha: పునుకుల పంచాయతీలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమం నిర్వహణ!
Palvancha: పాల్వంచ క్లస్టర్ పునుకులలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం. భూసార పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగంపై ఎంఏఓ శంకర్, ఏఈఓ నరేష్ రైతులకు అవగాహన.
Palvancha: పునుకుల పంచాయతీలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమం నిర్వహణ!
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ క్లస్టర్ పరిధిలోని పునుకుల పంచాయతీలో కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ఖేత్ బచావో అభియాన్ – స్వస్థ్ ధరా,సమృద్ధ్ కిసాన్" కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగుభూమి సంరక్షణ,నేల ఆరోగ్యం,భూసార పరిరక్షణ,సమతుల్య ఎరువుల వినియోగం,స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30,2026 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రైతులకు నేల సారాన్ని కాపాడుకోవడం,భూసార పరీక్షల ప్రాముఖ్యత,సేంద్రియ ఎరువుల వినియోగం,పంటల మార్పిడి విధానం వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.ఎస్.శంకర్,పాల్వంచ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి (ఏఈఓ) జి.నరేష్,పునుకుల పంచాయతీ కార్యదర్శి బాబురావు,సర్పంచ్ వజ్జా కృష్ణవేణి,ఉప సర్పంచ్ మాలోతు వీరుతో పాటు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అధికారులు రైతులు నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఆధునిక,స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.




