Palvancha: కిన్నెరసాని అభయారణ్యాన్ని సందర్శించిన జర్మనీ బృందం!
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ శాంక్చురీని జర్మనీకి చెందిన 18 మంది సభ్యుల బృందం స్టడీ టూర్లో భాగంగా సందర్శించింది.
Palvancha: కిన్నెరసాని అభయారణ్యాన్ని సందర్శించిన జర్మనీ బృందం!
పాల్వంచ, అక్టోబర్ 26: స్టడీ టూర్లో భాగంగా జర్మనీ దేశానికి చెందిన 18 మంది సభ్యుల బృందం సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ శాంక్చురీని సందర్శించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు అభయారణ్యంలోని ప్రకృతి పరిసరాలను పరిశీలించగా, అటవీ అధికారులు వారి వెంట ఉండి అక్కడి ప్రత్యేకతలు, అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
అభయారణ్యాన్ని సందర్శించిన జర్మనీ బృందాన్ని అక్కడికి వచ్చిన పర్యాటకులు, స్థానికులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసానికి వస్తుంటారు. అయితే విదేశాలకు చెందిన 18 మంది సభ్యుల బృందం స్టడీ టూర్లో భాగంగా ఇక్కడికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రకృతి అందాలు, అటవీ సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందిన కిన్నెరసాని అభయారణ్యాన్ని విదేశీ బృందం సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సందర్శనలతో కిన్నెరసాని ప్రాంతానికి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




