Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు
Palvancha: పాల్వంచలో జరగనున్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణను మాదిగ జాతి బహిష్కరించింది. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు దీన్ని నిర్వహిస్తున్నారన్నారు.
Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు
పాల్వంచ: ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాదిగ జాతి నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 4న పాల్వంచలో జరగనున్న మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాదిగ జాతికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల మాదిగ జాతి తరఫున బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
విగ్రహం పేరుతో కొందరు వ్యక్తులు మాదిగ జాతిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. మాదిగ జాతి ఐక్యత కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి పేరును వినియోగిస్తూ జాతి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.
కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వారికి మరికొందరు సహకరిస్తున్నారని విలేకరుల సమావేశంలో నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పాల్వంచ మండల మాదిగ జాతి తరఫున తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో వానపాకుల రాంబాబు, కటుకూరి శేఖర్ బాబు, అల్లూరి సాంబశివరావు, పొట్టపింజర బ్రహ్మానందరావు, కొత్తపల్లి శ్రీను, మోదుగు వెంకన్న, గుండెపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




