Palvancha: పట్టణ కాంగ్రెస్ పరిశీలకులుగా పైడా రాజేంద్ర ప్రసాద్ నియామకం

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల పరిశీలకులుగా జిల్లా జనరల్ సెక్రటరీ పైడా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 16 Nov 2026 5:32 PM IST
Palvancha
X

Palvancha: పట్టణ కాంగ్రెస్ పరిశీలకులుగా పైడా రాజేంద్ర ప్రసాద్ నియామకం

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల పరిశీలకులుగా జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పైడా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న ఆదేశాల మేరకు, టీపీసీసీ నిర్దేశించిన పాల్వంచ పట్టణానికి సంబంధించిన సమాచారాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, పట్టణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు పైడా రాజేంద్ర ప్రసాద్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు సాదం రామకృష్ణ, పట్టణ కాంగ్రెస్ నాయకులు దొప్పలపూడి సురేష్ బాబు, బానోత్ రాము నాయక్, గుండు రవి, ఓలపల్లి రాంబాబు, బిల్లా సుజిత్, బాలు, మాలు నాయక్, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు షేక్ దస్తగిరి, రఫీ, ఓబీసీ నాయకుడు కాపర్తి చారి, యూత్ కాంగ్రెస్ నాయకుడు గండు భరత్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN