Palvancha: పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృత అభిషేకం.. భక్తిశ్రద్ధలతో పూజలు!

Palvancha: పాల్వంచ కేశవాపురం–జగన్నాధపురం శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో అమ్మవారికి వైభవంగా పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 6 Nov 2026 11:31 PM IST
Palvancha
X

Palvancha: పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృత అభిషేకం.. భక్తిశ్రద్ధలతో పూజలు!

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాధపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో గురువారం పెద్దమ్మ తల్లికి పంచామృత అభిషేకం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ముందుగా మేళతాళాల నడుమ దేవస్థాన అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థలం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి భక్తిపూర్వకంగా హారతి ఇచ్చారు. అనంతరం ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

పెద్దమ్మ తల్లి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ. విజయ్ కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN