Palvancha: పెద్దమ్మగుడిలో మాసశివరాత్రి రుద్రహోమం!
Palvancha: పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో నవంబర్ 7న మాసశివరాత్రి సందర్భంగా శాస్త్రోక్తంగా రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Palvancha: పెద్దమ్మగుడిలో మాసశివరాత్రి రుద్రహోమం!
పాల్వంచ: మాసశివరాత్రిని పురస్కరించుకొని పాల్వంచలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో ఈ నెల 7వ తేదీన రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రుద్రహోమంలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.1,516 చెల్లించి ముందస్తుగా లేదా కార్యక్రమం రోజున తమ గోత్రనామాలను నమోదు చేసుకోవాలని సూచించారు. హోమంలో పాల్గొనే దంపతులకు స్వామివారి శేషవస్త్ర ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా హాజరుకాలేని భక్తుల పేర్లతో సంకల్పం చేసి హోమం నిర్వహించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 6303408458 నంబర్‌ను సంప్రదించాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




