Palvancha: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరారీ
Palvancha: పాల్వంచ మండలం పునుకులలో పేకాట స్థావరంపై రూరల్ పోలీసుల దాడి. ఇద్దరు నిందితుల అరెస్ట్, రూ.1,400 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం, నలుగురు పరారీ.
Palvancha: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరారీ
పాల్వంచ: పాల్వంచ మండలం పునుకుల గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పాల్వంచ రూరల్ పోలీసులు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పునుకుల గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్ (36), పొదెం వెంకటేశ్వర్లు (45) లను సంఘటనా స్థలంలోనే పట్టుకున్నారు.
అదే సమయంలో పేకాట ఆడుతున్న మరో నలుగురు కోర్సా అబ్బాస్, అడపా రాంబాబు, వజ్జా బాబురావు, శెట్టిపల్లి సురేష్ లు పోలీసులను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అనంతరం పోలీసులు ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ.1,400 నగదు, రెండు సెల్ ఫోన్లు, 104 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఇద్దరు నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను పోలీస్ స్టేషన్ కు తరలించి, ఎస్సై బి.సురేష్ ఫిర్యాదు మేరకు సాయంత్రం 4.30 గంటలకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాల్వంచ రూరల్ పోలీసులు హెచ్చరించారు.




