Palvancha: సమాజ సేవలో మీడియా పాత్ర కీలకం: కల్పనా చౌదరి!

Palvancha: పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి జర్నలిస్టులకు పుస్తకాలు, ₹10,016 విరాళం అందించి సమాజ సేవలో మీడియా పాత్ర కీలకమన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 18 Oct 2026 4:44 PM IST
Palvancha
X

Palvancha: సమాజ సేవలో మీడియా పాత్ర కీలకం: కల్పనా చౌదరి!

Palvancha: మీడియా సమాజానికి దిక్సూచి లాంటిదని, ప్రభుత్వాలకు - ప్రజలకు మధ్య వారధిగా కీలక పాత్ర పోషిస్తోందని కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి అన్నారు.

ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కోసం రూ.10 వేల విలువైన జర్నలిజం పుస్తకాలను బహుకరించారు. అదేవిధంగా తమ వంతు సహకారంగా ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం రూ.10,016 నగదును విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా కల్పనా చౌదరి మాట్లాడుతూ, తాను పుట్టి పెరిగిన పాల్వంచ ప్రాంతంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఇక్కడి పరిసర ప్రాంతాలను విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిరుపేదలకు ఉచిత విద్య,

వైద్య సేవలు అందించడానికి తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

అనంతరం సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న కొల్లి ఫౌండేషన్ కృషి అభినందనీయమని అన్నారు.

ఫౌండేషన్ కు తమ వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రతి సేవా కార్యక్రమంలో భాగస్వాములమవుతామని తెలిపారు. ప్రెస్ క్లబ్ కు పుస్తకాలు, నగదు విరాళం అందించిన కల్పనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు, కొల్లి ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN