Palwancha: పాల్వంచలో తూనికల కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తూనికల కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు. చేపల వ్యాపారుల మోసాలు బట్టబయలు, కాటాలు స్వాధీనం చేసుకున్న అధికారులు.
Palwancha: పాల్వంచలో తూనికల కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారి కె. సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో తూకంలో తేడా ఉన్నట్లు గుర్తించిన కాటాలు, రాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చికెన్ సెంటర్లు, చేపల వ్యాపారుల వద్ద తనిఖీలు చేపట్టగా, ముఖ్యంగా చేపల వ్యాపారులు ఉపయోగిస్తున్న కాటాల్లో కిలోకు 200 గ్రాముల వరకు తూకంలో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేసినట్లు అధికారి కె. సుభాష్ తెలిపారు.వినియోగదారులను మోసం చేసే విధంగా తూనికల్లో తేడాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారి హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో, ఈ మధ్య కాలంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా తూనికల్లో తేడాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.




