Palwancha: పాల్వంచలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు ఎమ్మెల్యే కూనంనేని మద్దతు!

Palwancha: పాల్వంచ కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపిన కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 2 Nov 2026 2:05 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు ఎమ్మెల్యే కూనంనేని మద్దతు!

Palwancha: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పాల్వంచలోని కలెక్టరేట్ సమీప ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఆందోళనకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో కీలక సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూనంనేని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN