Palwancha: గురుకులంలో ఘనంగా నెహ్రూ జయంతి.. పేరెంట్స్ మీట్
Palwancha: పాల్వంచ పీఎం శ్రీ గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి వేడుకలు, పేరెంట్స్ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెహ్రూను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Palwancha: గురుకులంలో ఘనంగా నెహ్రూ జయంతి.. పేరెంట్స్ మీట్
పాల్వంచ: భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రిన్సిపాల్ అన్వేష్ విద్యార్థులకు సూచించారు. పాల్వంచ పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల / కళాశాలలో నెహ్రూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ నెహ్రూ జీవిత ఘట్టాలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, ప్రధానిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
పేరెంట్స్ కమిటీ మీటింగ్:
పాఠశాలలో ప్రతి నెల రెండవ శనివారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల రెండవ శనివారం జరిగిన సమావేశానికి కమిటీ అధ్యక్షుడు కొప్పుల రాము అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అన్వేష్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సంవత్సరంలో కనబరిచిన ప్రగతిని, పనితీరును వివరించారు. విద్యార్థుల అటెండెన్స్ తక్కువగా ఉండవద్దని, క్రమశిక్షణతో ఎలా మెలగాలో తెలియజేశారు. చదువుతో పాటు స్పోర్ట్స్, గేమ్స్, డ్రాయింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ వంటి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా ప్రతిభను కనబరచాలని తెలిపారు.
ముఖ్యంగా పాఠశాలలో పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఉపాధ్యాయులు, పేరెంట్స్ సమన్వయంతో పని చేస్తే విద్యార్థులు విద్యలో రాణిస్తారని అన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సయ్య, అశోక్, సరోజిని, పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షులు స్వర్ణలత, పాఠశాల కమిటీ కో ఆర్డినేటర్ శనగ రామచందర్ రావు, ట్రెజరర్ కొండ కుమారి, కమిటీ సభ్యులు బండి రమేష్, అనీల్, గుర్రం రమేష్, గండూరి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.




