Palwancha: గర్భిణులకు శ్రీమంతం.. అంగన్వాడీ ఆయాలకు సత్కారం...

Palwancha: పాల్వంచలో పోషణ మాసంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహార సమ్మేళనం నిర్వహించి, గర్భిణులకు శ్రీమంతం చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 30 Sept 2026 11:19 PM IST
Palwancha
X

Palwancha: గర్భిణులకు శ్రీమంతం.. అంగన్వాడీ ఆయాలకు సత్కారం...

పాల్వంచ: సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా, పోషణ మాసాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని బొల్లోరిగూడెం 1, 2, 3, సెంట్రల్ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం పోషకాహార సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

భద్రాద్రి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వ అపర్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలను శాలువాలతో సత్కరించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి, పోషకాహారం, తల్లి ఆరోగ్యం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మువ్వ అపర్ణ మాట్లాడుతూ.. ప్రసవం అనంతరం తల్లి పాలు శిశువుకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకు గురువులుగా, తల్లులుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాల సేవలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు నాగమణి, సరస్వతి, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN