Manuguru: అద్దె వాహన డ్రైవర్లకు ₹5,500 లాభాల వాటా వెంటనే చెల్లించాలి!
Manuguru: మణుగూరు సింగరేణి అద్దె వాహన డ్రైవర్లు, కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ₹5,500 లాభాల వాటాను చెల్లించాలని TUCI నేత మధుసూదన్ రెడ్డి డిమాండ్.
Manuguru: అద్దె వాహన డ్రైవర్లకు ₹5,500 లాభాల వాటా వెంటనే చెల్లించాలి!
Manuguru: మణుగూరు ఏరియాలోని సింగరేణి అద్దె వాహన డ్రైవర్లకు మరియు ఇప్పటివరకు చెల్లించని కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వము, సింగరేణి ప్రకటించిన లాభాల వాటా 5, 500 రూపాయలు వెంటనే చెల్లించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(TUCI) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఓసి 2 లో సింగరేణి అద్దె వాహనాల డ్రైవర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం సింగరేణిలోని వివిధ విభాగాల కాంటాక్ట్ కార్మికులకు ప్రకటించిన లాభాల వాటా 5, 500 రూపాయలు మణుగూరు ఏరియాలోని సింగరేణి అద్దె వాహన డ్రైవర్లకు మరియు కొన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు నేటికీ చెల్లించ లేదన్నారు.
ఇట్టి విషయాన్ని వెహికిల్ ఇన్చార్జి గారి దృష్టికి తీసుకెళ్లగా ప్రాసెస్ మొదలుపెట్టామని రెండు రోజుల్లో అందరికీ చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రెండు రోజులలో లాభాల వాటా 5, 500 రూపాయలు ఇప్పటివరకు చెల్లించని మణుగూరు ఏరియాలోని అన్ని విభాగాల సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో సింగరేణి కన్వీనియన్స్ వాహన డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




