Bayyaram: బయ్యారంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Bayyaram: బయ్యారంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బయ్యారం మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులునాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా నాయిని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే, భారత యువతపై ఆయనకున్న అంచంచల విశ్వాసంతోనూ, సాంకేతిక పురోగతిపై ఆయన చూపిన దూరదృష్టితోనూ, కొత్త ఆలోచనల శక్తిపై ఆయన నమ్మకం లోను ఆయన వారసత్వం నేటికీ సజీవంగా నిలిచివుంది.
రాజీవ్ జీకి మనం అందించగల అత్యంత అర్థవంతమైన నివాళి ఏమిటంటే—భారతదేశపు చిరస్మరణీయ "సామరస్యం", "సమరసత్వం", "సమైక్యత" స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తూ, మేధో నైపుణ్యాన్ని, ఆవిష్కరణలను, మన యువత ఆకాంక్షలను ప్రోత్సహించడం జరిగింది అన్నారు
జయంతి సందర్భంగా గాఢమైన నివాళులు అర్పిస్తూ, దేశ నిర్మాణానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలను, విశిష్టమైన కృషిని స్మరించుకుంటూ
రాజీవ్ గాంధీ ఘననివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్, బయ్యారం pacs ఛైర్మెన్ బండారు మల్లయ్య, ఉపసర్పంచ్ ఎనుగుల ఉమా రంజిత్, మొట్లతిమ్మాపురం బిజ్జ సాంబశివరావ్, మాజీ ఎంపీపీ కిషన్ నాయక్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ములుకురి వీరారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి పెద్దిని వెంకటేశ్వరరావ్, వార్డు మెంబర్ బానోత్ అజయ్,కొండ్రేడ్డి సోమిరెడ్డి, తగిర సత్తిరెడ్డి, తాటి జనార్డన్, దాసరి శ్రీధర్,నందగిరి భద్రయ్య, మండల మహిళా నాయకురాలు మండ రేణుక, నందిపాటి బవాణి, కత్తి రాదాకృష్ణ,ఆకునూరు సూర్యనారాయణ,కంకటి నారాయణ,రామగిరి వెంకటేశ్వర్లు,బీరెడ్డి శ్రీనివాస్,పులి మల్లయ్య, నద్దునురి లింగయ్య, పెద్ద బుజ్జి. కంచర్ల సురేష్,రామసాని బిక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




