Yellandu: కీచక ఉపాధ్యాయుడిపై చర్యలేవీ: పీడీఎస్‌యూ నిరసన
Yellandu: ఇల్లందు జేబీఎస్ పాఠశాలలో విద్యార్థినులను వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ ఆందోళన చేపట్టింది.
Yellandu: కీచక ఉపాధ్యాయుడిపై చర్యలేవీ: పీడీఎస్‌యూ నిరసన
ఇల్లందు: ఇల్లందు పట్టణం జేబీఎస్ పాఠశాలలోని ఓ గిరిజన ఉపాధ్యాయుడు గిరిజన విద్యార్థినీలపై నీచ ప్రవర్తనతో పైశాచిక ఆనందం పొందుతూ విద్యార్థినీలను కొన్ని రోజుల నుండి మానసిక వేధింపులకు గురి చేసిన కీచక ఉపాధ్యాయుడిపై నేటికి చర్యలేవని పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ జిల్లా కార్యదర్శి గణేష్ అన్నారు.
ఈరోజు పిడిఎస్యు విద్యార్థి సంఘాలు సంఘాల ఆధ్వర్యంలో జేబీఎస్ పాఠశాల గేటు ముందు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు విద్యార్థినీలపై విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే నీచంగా ప్రవర్తించే సంఘటనలు పెరిగిపోతున్నాయని ఉపాధ్యాయుల నుండే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు పున:రావృతం కావడం సమాజం సిగ్గుపడాల్సి వస్తుందని అన్నారు.
తప్పుడు పనులు చేస్తూ,తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం పాఠశాల లో రెండు కులాల మధ్య రెచ్చగొట్టే ధోరణి తీసుకొచ్చి జరిగిన సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడని అన్నారు. గిరిజన విద్యార్థినీలపై గిరిజన ఉపాధ్యాయుడే ఇలాంటి పనికి దిగజారడం వలన గిరిజన సమాజం ఆవేదన చెందుతుందని అన్నారు.
అధికారులు కిచక ఉపాద్యాయుడు నీచపు పనులు చేసిన చూసి చూడనట్లుగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థులు ఆవేదనతో తెలిపిన విషయాలను పరిగణంలోకి తీసుకొని ఆ ఉపాధ్యాయుడి పై ఫోక్సో కేస్ నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై తక్షణమే కలెక్టర్,డీఈవో స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ ఇల్లెందు డివిజన్ నాయకులు గంగాధర్ గణేష్, పి డి యస్ యూ నాయకులు ఆయుష్, హేమచంద్ర, నాగచైతన్య, పండు తదితరులు పాల్గొన్నారు.




