Peddapalli: పెద్దపల్లిలో వరి పంట మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి!
Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్లో వరి మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా.
Peddapalli: పెద్దపల్లిలో వరి పంట మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో వరి పంటకు మద్దతు ధరకు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం జిల్లాలో వరి కొనుగోళ్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పెద్దపల్లి కలెక్టరేట్ లో వరి మద్దతు ధర పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కలెక్టర్ కోయ శ్రీ హర్ష




