Penuballi: పెనుబల్లిలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు!
Penuballi: పెనుబల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి.
Penuballi: పెనుబల్లిలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు!
Penuballi: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్ మేజర్ గ్రామంలో ఉన్న ఆర్కే ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు బుక్కా కృష్ణవేణి, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వసుమర్తి విశ్వనాథ్, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




