Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా పెరియార్ 147వ జయంతి వేడుకలు!
Bhadrachalam: భద్రాచలం సిద్ధార్థ కళాశాలలో పెరియార్ 147వ జయంతి ఘనంగా నిర్వహణ. దేవుడి పేరుతో మనువాదులు చేస్తున్న మోసాలను తిప్పికొట్టిన సామాజిక విప్లవకారుడు పెరియార్ అని వక్తలు కొనియాడారు.
Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా పెరియార్ 147వ జయంతి వేడుకలు!
భద్రాచలం సెప్టెంబర్ 17: దేవుడి పేరు మీద మనువాదులు చేస్తున్న మోసాలను ప్రతిఘటించిన సామాజిక విప్లవకారులు పెరియార్. డాక్టర్ భాను ప్రసాద్. స్థానిక సిద్ధార్థ కళాశాల నందు స్వయం గౌరవ ఉద్యమ వేదిక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెరియార్ 147వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్ అధ్యక్షత వహించగా సామాజిక ఉద్యమకారులు, స్వయంవరం ఉద్యమ నేత డాక్టర్ భాను ప్రసాద్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మహాజన మహిళా మండలి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల లత లు మాట్లాడుతూ అంటరానితనం, అవమానం, వివక్షతలు, మనిషిని మనిషిగా చూడలేని దుర్మార్గపు వ్యవస్థను ఎండగడుతూ మనువాదుల గుండెల్లో రివాల్వర్ తూటాల ప్రతిధ్వనిస్తున్న పెరియార్ విద్యార్థి లోకానికి, మహిళలోకానికి,సమాజానికి ఆదర్శ ప్రాయుడని అన్నారు.
మనువాద వ్యవస్థ తోటి మనిషి మనిషిగా చూడనివ్వకుండా నిర్బంధాలు ప్రయోగిస్తే ఆ కుల వ్యవస్థను రద్దు పరచాలని పోరాటం చేసిన యోధుడు పెరియార్ అని అన్నారు. పెరియార్ , బిఆర్ అంబేద్కర్ జీవితం గురించి మనువాదులు చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పి కొట్టాలని, ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని కోరారు.
భద్రాచల పట్టణంలో అతి త్వరలో పెరియార్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ, పెరియార్ భావాలతో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి అధ్యక్షులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, మర్మం చిట్టిబాబు, అర్జున్, శివ, మురళి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




