Bhadrachalam: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

Bhadrachalam: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి; దరఖాస్తులకు నవంబర్ 7 చివరి తేదీ.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Updated on: 31 Oct 2026 6:52 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

భద్రాచలం: 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తి భద్రాచలంలో పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. జాన్ మిల్టన్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో M.Sc. కెమిస్ట్రీ, M.Sc. ఫిజిక్స్, M.A. తెలుగు, M.A. ఇంగ్లీష్, M.A. ఎకనామిక్స్ మరియు M.Com కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశముందని ఆయన అన్నారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు TG CPGET-2026 నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు.

అడ్మిషన్లు పొందుటకు చివరి తేదీ 07-11-2026.

అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు TG CPGET-2026 ర్యాంక్ కార్డు, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, డిగ్రీ ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్, కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం (వర్తించినట్లయితే), నివాస ధృవీకరణ పత్రం, ఈక్వివలెన్స్ సర్టిఫికెట్ (వర్తించినట్లయితే) ఒరిజినల్స్ సమర్పించాలని ఆయన అన్నారు.

పీజీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem