Pinapaka: చిట్టిమల్ల రత్తమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం
Pinapaka: పినపాక మండలం తోగ్గుడెంలో చిట్టిమల్ల రత్తమ్మ మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Pinapaka: చిట్టిమల్ల రత్తమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం
పినపాక: పినపాక మండలం తోగ్గుడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సతీష్ చారి గారి మాతృమూర్తి చిట్టిమల్ల రత్తమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రత్తమ్మ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




