Manuguru: గ్లోబల్ అవార్డులు సాధించిన మణుగూరు కరాటే క్రీడాకారిణులు!

Manuguru: గ్లోబల్ స్థాయిలో అవార్డులు అందుకున్న మణుగూరు కరాటే మాస్టర్ పద్మ, రిషికలను అభినందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. శాలువాతో సత్కారం.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 22 Sept 2026 11:46 AM IST
Manuguru
X

Manuguru: గ్లోబల్ అవార్డులు సాధించిన మణుగూరు కరాటే క్రీడాకారిణులు!

Manuguru: మణుగూరుకు చెందిన కరాటే మాస్టర్ కాసిమల్ల పద్మ, గుగులోత్ రిషిక గ్లోబల్ స్థాయిలో అవార్డులు అందుకోవడం పట్ల పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు అభినందనలు తెలిపారు.

మణుగూరుకు చెందిన సీనియర్ కరాటే మాస్టర్ కాసిమల్ల పద్మ బ్లాక్ బెల్ట్ 4వ డాన్ విభాగంలో గ్లోబల్ మాస్టర్ అవార్డు అందుకోగా, గుగులోత్ రిషిక బ్లాక్ బెల్ట్ 1వ డాన్ విభాగంలో గ్లోబల్ స్టార్ కిడ్ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా కాసిమల్ల పద్మ, గుగులోత్ రిషిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు శాలువాలతో సత్కరించి అభినందించారు. మణుగూరు ప్రాంతానికి చెందిన వారు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.

క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ రంగాల్లో యువత మరింతగా రాణిస్తూ ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మణుగూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA