Hyderabad: భారత్ సమ్మిట్-2026లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే!

Hyderabad: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'భారత్ సమ్మిట్–2026' అంతర్జాతీయ సదస్సులో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 15 Nov 2026 8:49 AM IST
Hyderabad
X

Hyderabad: భారత్ సమ్మిట్-2026లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే!

Hyderabad: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్–2026 (Bharat Summit 2026) కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం విశేషం.

“Forging a New World” (నూతన ప్రపంచ నిర్మాణం) అనే ప్రధాన ఇతివృత్తంతో నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని HICC, HITEX ప్రాంగణాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సుమారు 70 దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విధాన రూపకర్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

ఈ సదస్సులో ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఆర్థిక అసమానతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పులు, యువత పాత్ర, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ విధానాలు, పట్టణీకరణ, ఆర్థిక మరియు సామాజిక న్యాయం వంటి అంశాలకు కూడా ఈ సమ్మిట్‌లో ప్రాధాన్యత కల్పించారు.

ప్రపంచ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ వేదిక హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోంది.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA