Pinapaka: రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరు

Pinapaka: పినపాక నియోజకవర్గ అభివృద్ధికై హెచ్‌ఏఎం విధానంలో రూ.186 కోట్లు మంజూరు. దసరాలోపే రోడ్లు, వంతెనల పనులు ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Sept 2026 11:00 PM IST
Pinapaka
X

Pinapaka: రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరు

పినపాక: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి.

ఈ విషయాన్ని పినపాక ఎమ్మెల్యే వెల్లడించారు. మంజూరైన నిధులతో నియోజకవర్గంలో అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా దసరా పండుగలోపే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా, చేపట్టబోయే పనులకు సుమారు 15 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యత కూడా సంబంధిత సంస్థలదే ఉండే విధంగా హెచ్‌ఏఎం విధానంలో పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

పినపాక నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

పినపాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ, రహదారులు, వంతెనల నిర్మాణానికి ఇంత భారీ స్థాయిలో నిధులు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు మరియు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

“ఈ నిధులతో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. రహదారులు, వంతెనల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనులను వేగంగా ప్రారంభిస్తాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA