Sathupalli: రాయలసీమ యూనివర్సిటీ నుంచి సీఎస్‌ఈలో పీహెచ్‌డీ!
Sathupalli: సత్తుపల్లి మండలం రామానగరం వాసి పిన్నబోయిన మారేశ్వరరావుకు సీఎస్‌ఈలో పీహెచ్‌డీ రాయలసీమ వర్సిటీ నుంచి డాక్టరేట్ మదర్ తెరిసా కళాశాల యాజమాన్యం ఘన సన్మానం.
Sathupalli: రాయలసీమ యూనివర్సిటీ నుంచి సీఎస్‌ఈలో పీహెచ్‌డీ!
సత్తుపల్లి: మండల పరిధిలోని రామా నగరం కు చెందిన పిన్నబోయిన. మారేశ్వరరావు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీ అయిన రాయలసీమ యూనివర్సిటీలో పిహెచ్డిని డాక్టర్ కుర్ర రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో" ఇంప్రూవ్డ్ అండ్ ఎంహాన్సుడ్ సెక్యూరిటీ అప్ప్రోచెస్ టు ఇంప్రూవ్ ప్రైవసీ ఎన్హసింగ్ అండ్ మల్టీ యాక్సెస్ కంట్రోల్ పాలసీస్ ఇన్ సోషల్ నెట్వర్క్" అనే అంశంపై పరిశోధన చేసి ఆ ప్రతులను యూనివర్సిటీ నందు సమర్పించడం ద్వారా డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది.
వీరి ప్రాథమిక విద్యాభ్యాసం రామానగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు, ఉన్నత విద్యాభ్యాసం నాచారం ఉన్నత పాఠశాల నందు, గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీ నందు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నందు మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీ అయిన రాయలసీమ యూనివర్సిటీ నందు పూర్తి చేశారు. వీరు గత రెండు దశాబ్దాలుగా మదర్ తెరిసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.
వీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ ని పూర్తి చేసిన సందర్భంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని హరికృష్ణ, మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ శ్రీ చలసాని సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొత్తూరి ప్రభాకర్ రావు, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ కందిమల్ల కృష్ణారావు , డైరెక్టర్స్ శ్రీ కంచర్ల సత్యనారాయణ, శ్రీ కొత్తూరు సత్యనారాయణ, కళాశాలలోని వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.




