Bhadrachalam: పొదెం వీరయ్య పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదు పరిమి!

Bhadrachalam: మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదని భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరిమి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Sept 2026 6:33 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: పొదెం వీరయ్య పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదు పరిమి!

Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 29 -మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు *శ్రీ పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరిమి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో కొందరు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

పొదెం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధం ఉందని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టమైన నిబద్ధతతో చెప్పే నాయకుడు ఆయన అని పరిమి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ కండువాతోనే తన అంతిమయాత్ర జరగాలని కోరుకునేంతగా పార్టీ సిద్ధాంతాలు ఆశయాల పట్ల ఆయనకు గాఢమైన విశ్వాసం ఉందన్నారు.ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు ప్రలోభాలు ఎదురైనా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని వీడకుండా మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడు పొదెం వీరయ్య అని ఆయన అన్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడంలో పొదెం వీరయ్య గారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.పొదెం వీరయ్య పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియా, వివిధ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు నమ్మవద్దని పరిమి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. నిరాధారమైన ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, పార్టీ పట్ల పొదెం వీరయ్య గారికి ఉన్న నిబద్ధతను కాంగ్రెస్ కోసం ఆయన చేసిన సేవలను ప్రతి కార్యకర్త గుర్తించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో పొదెం వీరయ్య గారికి ఎల్లప్పుడూ సముచిత స్థానం, గౌరవం ఉంటాయని, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, ఈ పార్టీ ఆయనకు పేటెంట్ రైట్ అని భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరిమి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem