Burgampahad: పోలవరం ప్రాజెక్టు అథారిటి కమిటీ కి వినతిపత్రం అందజేత

Burgampahad: సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో పోలవరం అథారిటీ అధికారులను కలిసిన బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు, అఖిలపక్ష నేతలు.

G Ravi, Bhadradri
Published on: 4 Jun 2026 3:50 PM IST
Burgampahad
X

Burgampahad: పోలవరం ప్రాజెక్టు అథారిటి కమిటీ కి వినతిపత్రం అందజేత

బూర్గంపహాడ్: సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు పోలవరం ప్రాజెక్టు అథారిటి అధికారులను సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నందు కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ఎత్తు పెంపుతో బూర్గంపహాడ్ గ్రామానికి పొంచిఉన్న ముప్పుపై పోలవరం అధికారులకు తెలియజేశారు.

దీంతో స్పందించిన అధికారులు పోలవరం బ్యాక్ వాటర్ వలన తెలంగాణ ప్రాంతంలో ముంపుకు గురికానున్న గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే ద్వారా ముంపుకు గురికానున్న గ్రామాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించటంతో పాటు ముంపుకు గురయ్యే ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలో పొందుపరచనున్నట్లు వారు తెలిపారు.

కార్యక్రమంలో వార్డు మెంబర్లు భజన పెదనాగం, తోకల శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు, గ్రామపెద్దలు లక్కోజి విష్ణువర్ధన్, కెవి రమణ, కైపు శ్రీనివాస్ రెడ్డి, గుద్దేటి ప్రవీణ్ కుమార్, వి వి బి చారి, ఆశిక్ ( లైక్ సార్), దన్సీరాం పున్నంచంద్, హరినాథ్, గూడూరు వెంకన్న, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మున్నా తదితరులు పాల్గొన్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story