Manuguru: 1.5 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు నిందితుల అరెస్ట్!

Manuguru: మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్‌లోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 22 Nov 2026 12:52 PM IST
Manuguru
X

Manuguru: 1.5 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు నిందితుల అరెస్ట్!

Manuguru: ఈ రోజు ఉదయం మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో నివాసం ఉంటున్న పాషా అనే వ్యక్తి ఇంట్లో గంజాయి అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించాము.

ఈ తనిఖీలలో 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితులపై NDPS Act ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA