Palvancha: గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. బొలెరో వాహనం స్వాధీనం!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు. అంబేద్కర్ సెంటర్ వద్ద బొలెరో వాహనాన్ని పట్టుకున్న పోలీసులు, గోశాలకు తరలింపు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 22 Oct 2026 11:47 AM IST
Palvancha
X

Palvancha: గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. బొలెరో వాహనం స్వాధీనం!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఓ బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. అతివేగంగా వెళ్తున్న వాహనాన్ని గమనించిన పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, వాహనదారుడు ఆపకుండా వెళ్లడంతో వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గోవులు ఉన్నట్లు గుర్తించారు.

చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిసర గ్రామాల నుంచి గోవులను సేకరించి, కొత్తగూడెం, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులోని గోవులను స్థానిక గోశాలకు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గోవులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలో గోవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN