Khammam: ఆధునీకరించిన కల్లూరు ఏసీపీ కార్యాలయం ప్రారంభం

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఆధునీకరించిన కల్లూరు ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు.

M RAVIKIRAN
Published on: 8 May 2026 5:34 PM IST
Khammam
X

Khammam

Khammam: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆధునీకరించిన కల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు.

శుక్రవారం సత్తుపల్లికి చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఏసీపీ వసుంధర యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, పోలీస్ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అధికారులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించేందుకు ఆధునిక సదుపాయాలతో ఏసీపీ కార్యాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు.

ఏసీపీ కార్యాలయాల ఆధునీకరణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల కట్టడిపై మరింత సమర్థవంతంగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం, ఇన్స్పెక్టర్ శ్రీహరి, సీఐ ముత్తులింగం, కల్లూరు డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story