Kothagudem: కొత్తగూడెంలో పోలీస్ అమరవీరుల సంస్కరణార్థం భారీ సైకిల్ ర్యాలీ!

Kothagudem: కొత్తగూడెంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 Oct 2026 12:29 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో పోలీస్ అమరవీరుల సంస్కరణార్థం భారీ సైకిల్ ర్యాలీ!

Kothagudem: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం కొత్తగూడెంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు, టీజీఎస్పీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ సమీపం నుంచి ప్రారంభమై పాత డిపో, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ మీదుగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఆర్‌ఐలు సుధాకర్, కృష్ణారావు, జి.వి. రామారావుతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM