Kothagudem: గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత.. వాహనదారుల అవస్థలు!

Kothagudem: రామవరం-కొత్తగూడెం మార్గంలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వన్‌వే అమలు చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Aug 2026 10:48 PM IST
Kothagudem
X

Kothagudem: గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత.. వాహనదారుల అవస్థలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రామవరం–కొత్తగూడెం ప్రధాన రహదారిలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నిర్మించిన బ్రిడ్జిపై తరచూ గుంతలు ఏర్పడుతుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే బ్రిడ్జికి ఒక వైపున గుంతలు ఏర్పడటంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. తాజాగా మరో వైపున కూడా భారీ గుంత ఏర్పడటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రధాన రహదారిపై గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, టూ టౌన్ ఎస్‌ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా గుంత వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేశారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు.

ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపైనే తరచూ గుంతలు ఏర్పడుతుండటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి గుంతలు ఏర్పడకుండా నాణ్యమైన మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story