Kothagudem: ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం: ఎమ్మెల్యే కూనంనేని

Kothagudem: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో రూ.97 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, వీవో భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Nov 2026 4:59 PM IST
Kothagudem
X

Kothagudem: ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం: ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం: కొత్తగూడెం నియోజక వర్గ పరిథిలోని సుజాతనగర్, చుంచుపల్లి మండలాలలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో రూ.97 లక్షల వ్యయంతో పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

సుజాతనగర్ మండలం బేతంపూడి, మాలబంజరలో రూ.20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలతో పాటు 2 ఇంక్లైన్‌లో వీవో భవనాన్ని ప్రారంభించారు. చుంచుపల్లి మండలంలోని పెనగడప అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర కాలనీల్లో వీవో భవనాలు, బంజారాహిల్స్ నందతాండాలో సీసీ రోడ్డు, గరిమెళ్లపాడులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలతో ప్రజలకు సేవలు సులభతరమవుతాయని, వీవో భవనాలు మహిళా సమాఖ్యల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, పిఆర్ డిఈ నాగేందర్, విద్యుత్ ఏఈ నవీన్ కుమార్ విద్యుత్ ఏఈ కిషన్, సిపిఐ నాయకులు భూక్య దస్రు, కొమారి హనుమంతరావు, జక్కుల రాములు, గూగుల్ బాలు భాగం కృష్ణ నాగేంద్రబాబు కొమ్య, హతిరాం, ఆకుల వెంకన్న సారయ్య కృష్ణ భూక్య రవి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM