Khammam: 88 మందికి ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ: పువ్వాడ అజయ్
Khammam: పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినం సందర్భంగా ఖమ్మం రోటరీ క్లబ్, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 88 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలు పంపిణీ చేశారు.
Khammam: 88 మందికి ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ: పువ్వాడ అజయ్
ఖమ్మం: ఖమ్మం రోటరీ క్లబ్ మరియు పువ్వాడ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలు (Artificial Limbs) పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
తన తండ్రి శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు గారి 88వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అయితే వినాయక చవితి రాకతో ఈ సారి ఒక రోజు ముందుగానే ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1,140 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలను అమర్చినట్లు వెల్లడించారు.ఈ సేవా కార్యక్రమానికి పువ్వాడ ఫౌండేషన్ రూ. 3,52,000 ఆర్థిక సాయాన్ని రోటరీ ట్రస్ట్ ద్వారా అందజేసింది. తన తండ్రి 88 నిండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మానవతా దృక్పథంతో బాధితులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ఈ నిధులను సమకూర్చినట్లు ఈ రోజు ఒక్క రోజే 88 మందికి కృత్రిమ పాదాలు అందించినట్లు చెప్పారు.
గత 30 ఏళ్లుగా ఖమ్మంలోని రోటరీ లింబ్ సెంటర్ ద్వారా వేలాది మందికి సేవలు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ సెంటర్ ఎంతో కృషి చేస్తోందన్నారు.
పేదలకు ఉచిత మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే 1996లో 'మమతా హాస్పిటల్' (జనతా హాస్పిటల్) ను ప్రారంభించామని, నాటి నుండి నేటి వరకు లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్యం అందించామని గుర్తుచేశారు.
కమ్యూనిస్టు నాయకుడిగా, ప్రజా పక్షాన నిలబడిన శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు గారు తమ కుటుంబానికి ఎంతో స్ఫూర్తి అని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే తమ కుటుంబం విద్యా, వైద్య, సామాజిక రంగాల్లో సేవలందిస్తోందని స్పష్టం చేశారు.
దివ్యాంగుల కదలికలకు, వారి ఆత్మవిశ్వాసానికి తోడ్పడుతున్న రోటరీ క్లబ్ సభ్యులకు, వైద్య బృందానికి మరియు నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఖమ్మం రోటరీ ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్,రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ప్రెసిడెంట్ హరి శ్రీనివాస్,వైస్ చైర్మన్ కాళ్ళ పాపారావు,సెక్రటరీ దొడ్డపనేని సాంబశివరావు,వంగల జగన్నాథం,పసుమర్తి రంగారావు, NVNSN ప్రసాద్,చిటోజు రామకృష్ణ, వల్లభనేని రామారావు నాయకులు RJC కృష్ణ,పగడాల నాగరాజు,బత్తుల మురళీ తదితరులు పాల్గొన్నారు.




