Manuguru: మణుగూరు, అశ్వాపురంలో డయాగ్నొస్టిక్ సెంటర్ల తనిఖీ!
Manuguru: మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలున్న కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు.
Manuguru: మణుగూరు, అశ్వాపురంలో డయాగ్నొస్టిక్ సెంటర్ల తనిఖీ!
Manuguru: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పలు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డయాగ్నొస్టిక్ సెంటర్లలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్కు సంబంధించిన అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు నిబంధనల అమలును తనిఖీ చేశారు.
తనిఖీలలో గుర్తించిన లోపాలను సంబంధిత నిర్వాహకులకు తెలియజేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోపాలు గుర్తించిన డయాగ్నొస్టిక్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు.
తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి సమర్పించారు. ఈ తనిఖీల కార్యక్రమంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాందాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ పాల్గొన్నారు.




