Bhadrachalam: గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన అందేలా చూడాలి: ఐటీడీఏ పీవో
Bhadrachalam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9, 10 తరగతుల గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ అందేలా చూడాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు.
Bhadrachalam: గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన అందేలా చూడాలి: ఐటీడీఏ పీవో
భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీఈవో ఆధ్వర్యంలో నడపబడుతున్న జిల్లా పరిషత్ పాఠశాలలు కేజీబీవీలు మినీ గురుకులాలు ఎయిడెడ్ పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 9 10 తరగతి తరగతులు చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ అందించడానికి సంబంధిత డీఈవో ఎంఈఓ లు పిల్లల యొక్క వివరాలు సేకరించి తన కార్యాలయానికి పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం సాయంత్రం ఐ టి డి ఏ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీఈవో ఆ దినములో నడపబడుతున్న పాఠశాలల ఎంఈఓ లతో రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ తొమ్మిది పది తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు అందించడానికి రూపొందించవలసిన కార్యాచరణ గురించి మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో 9వ తరగతి పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ పథకం కింద డేస్ కాలర్ కు 3500 హాస్టల్లో చదివే పిల్లలకు 4500 స్కాలర్షిప్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించినందున సంబంధిత ఎంఈఓ లు వారి పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇన్కమ్, కులం సర్టిఫికెట్ బ్యాంకు ఖాతా, బోనఫైడ్ సర్టిఫికెట్ సేకరించి ఈనెల 10వ తేదీ లోపు డిడి ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి పంపించాలని అన్నారు.
9వ తరగతి గిరిజన విద్యార్థులు వచ్చే సంవత్సరం 10వ తరగతికి రాగానే ఇదే స్కీం కింద ఆ పిల్లల యొక్క స్కాలర్షిప్ ను ఆన్లైన్ చేయించాలని అన్నారు.
గిరిజన పిల్లల యొక్క కులం సర్టిఫికెట్ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని రావాలని, అన్ని రకాల సర్టిఫికెట్ లో ఉన్న గిరిజన పిల్లలకు మంగళవారం నుండి జాబితా తయారు చేసుకోవాలని అలాగే ఇతర ఇతర సర్టిఫికెట్ లేని పిల్లల యొక్క జాబితా తయారుచేసి వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.
డీఈవో, ఎంఈఓ లు మండలాల వారిగా ఆయా పాఠశాలల్లో 9వ తరగతి పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల యొక్క వారి యొక్క మొబైల్ లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ పొందుపరిచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ ద్వారా నేషనల్ పేమెంట్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేసే తెలంగాణ ఈపాస్ ఫ్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ డాటా లో పొందుపరిచే దానికి సంబంధించిన ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీ మా కార్యాలయానికి పంపించాలని అన్నారు.
9వ తరగతి పదవ తరగతి చదువుతున్న ఏ ఒక్క గిరిజన విద్యార్థిని వదలకుండా అందరికీ రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ అందేలా చూడాలని సంబంధిత ఏటీడీవోలు హెచ్ డబ్ల్యు ఓ లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఎస్ టి బి హెచ్ వసతి గృహాల హెచ్ఎం లతో ఫుడ్ ప్రొవిజనల్ గురించి వివరాలు సేకరించగా అశ్వరావుపేట వార్డెన్ సరైన సమాధానం చెప్పకపోవడం మరియు విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున సస్పెండ్ చేయమని డిడి ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశాలు జారీ చేశారు
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన తదితరులు పాల్గొన్నారు.




