Kothagudem: బతుకమ్మ చీరలపై కాపు సీతాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Kothagudem: రామవరంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేతపై రేవంత్ ప్రభుత్వంపై కాపు సీతాలక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు
Kothagudem: బతుకమ్మ చీరలపై కాపు సీతాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. రామవరంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదని ఆమె విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకే పరిమితమవుతున్నారని విమర్శిస్తూ, రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రామవరంలో మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.




