Kothagudem: అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!

Kothagudem: రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని జె. హర్షిక రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 12:52 PM IST
Kothagudem
X

Kothagudem: అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!

Kothagudem: ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభకు కొదవ లేదని నిరూపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని జె. హర్షిక అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

చిన్న వయస్సులోనే క్రీడలపై ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన హర్షిక విజయంపై పాఠశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు. హర్షికకు శిక్షణ అందించి విజయం సాధించడంలో కృషి చేసిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయురాలు ధర్మమ్మను కూడా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శంబు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. హర్షిక సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, జాతీయస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభకు హర్షిక విజయం నిదర్శనంగా నిలుస్తోందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భరత్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలోనూ ఆమె విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM