Kothagudem: మోడీ పాలనపై రేణుకా చౌదరి నిప్పులు!

Kothagudem: కొత్తగూడెంలో గ్రంథాలయ పనులకు రేణుకా చౌదరి, ఎంపీ రఘురామ్ రెడ్డి శంకుస్థాపన. ప్రధాని మోడీ వైఖరి, నీట్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 July 2026 5:07 PM IST
Kothagudem
X

Kothagudem: మోడీ పాలనపై రేణుకా చౌదరి నిప్పులు!

Kothagudem: కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి,

10 లక్షల ఎంపీ లాడ్స్ తో నిర్మించనున్న ప్రహారీ గోడ నిర్మాణానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామ సహాయం రఘురామ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రేణుక చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదని, విద్యా హక్కు కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

బాలికల పట్ల చిన్న చూపు తగదన్నారు. ఆడపిల్లలు అగ్రస్థాయిలో నిలవాలంటే విద్యే ప్రధానమన్నారు.

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని

తెలిపారు. మహిళా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉచిత బస్సు ,ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు..

ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేశారు. జూలై 20 నుండి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయని దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మోసాలు, ద్వేషాలు పెంచి లూటీలు చేస్తుంటే నేను దేశానికి వాచ్మెన్ అంటూ మౌనవ్రతం పాటిస్తున్న మోడీ,

దేశ ప్రధాని ఇన్ని దోపిడీలు దగా కోరు రాజకీయాలు జరుగుతుంటే కనీస స్పందన లేకుండా అవకాశం దొరికితే చాలని

మోడీ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారని,

విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత అటు పార్లమెంటులో గాని ఇటు మీడియాకు కానీ ప్రధాని మోడీ ఏమి చెప్పరని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో,

రాజ్యసభలో సోనియా గాంధీ ఆదేశంతో, ప్రియాంక గాంధీ సహాయంతో కేంద్ర ప్రభుత్వ విధానాలను

తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ అసలు విషయాలను డైవర్ట్ చేస్తూ.. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కాలయాపన చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు.

మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాల రాయాలని చూస్తున్నదని , స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ,హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు.

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అణుబాంబు కన్నా ఓటుకు అత్యధిక శక్తి ఉంటుందన్నారు. ఓటు హక్కు కోల్పోతే అనేక సౌకర్యాలు పథకాలు తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు.

రజాకార్లను ఎదుర్కొన్న పౌరుషం తెలంగాణది ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీహార్, బెంగాల్లో మాదిరిగా తెలంగాణలో ఆటలు సాగవని హెచ్చరించారు.

నీట్ పరీక్షల నిర్వహించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి తన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడని,

త్వరలోనే కేంద్రంలోని మంత్రుల మార్పు జరుగుతుందని జోష్యం చెప్పారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, నిధుల కుంభకోణం , కోట్లాది రూపాయల దోపిడి,

హిందుత్వం పేరుతో రాముడిని ఓటు బ్యాంకు గా మార్చుకొని దేవుడు సొమ్ము మాయం చేస్తున్నారని,

దేవుడి పేరుతో బ్యాలెట్ రాజకీయాలు చేస్తున్నారని, విమర్శించారు.

ఏపీలో చంద్రబాబు, బీహార్ లో నితీష్ లను చంకలో పెట్టుకొని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలన్నారు.

మోడీ ప్రభుత్వం బీహార్ బెంగాల్లో రాత్రికి రాత్రే కొన్ని లక్షల ఓట్లను తీసివేసిందని, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పప్పులు ఉడకవని హెచ్చరించారు.

తాను పార్లమెంట్ కు కుక్కని తీసుకెళ్తే రాద్ధాంతం చేశారని, కుక్కకు ఉన్న విశ్వాసం లేని వాళ్ళు నాపై పార్లమెంటులో ఆరోపణలు చేశారని విమర్శించారు.

భారతదేశ ఫారెన్ పాలసీ సరిగా లేదని ,చుట్టుపక్కల దేశాలతో సఖ్యత లేదన్నారు.

నేపాల్ లాంటి దేశం సైతం భారత్ ను బెదిరించే పరిస్థితి ఉందన్నారు.

పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజలపై పైన భారం మోపారని సిలిండర్లు కూడా దొరకని స్థితి ఏర్పడిందని విమర్శించారు.

జులై 20 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో రామసాయం రఘురాంరెడ్డి రాజ్యసభలో తాను రాష్ట్ర హక్కులు నిధుల కోసం తమ గళం వినిపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story