Mulakalapalli: జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
Mulakalapalli: ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించి పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ముదిగొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.
Mulakalapalli: జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
ములకలపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ముదిగొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కళాశాలను సందర్శించి విద్యార్థులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కళాశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పరిసరాల్లో పారిశుధ్యం సరిగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో తక్షణమే మరుగుదొడ్లు నిర్మించాలని, పరిసరాలను శుభ్రపరిచేలా శానిటేషన్ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం నూతన కాలేజీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శనగవరపు సంజయ్, నాయకులు చరణ్, స్వప్న, పల్లవి, రవీందర్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.




