Dammapeta: సీతారామ నిర్వాసితులకు రూ.10.24 కోట్ల పరిహారం: మంత్రి తుమ్మల

Dammapeta: దమ్మపేట మండలం నాగుపల్లిలో సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ-10 పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 34 మంది నిర్వాసితులకు రూ.10.24 కోట్ల చెక్కులు అందజేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 24 Oct 2026 7:20 PM IST
Dammapeta
X

Dammapeta: సీతారామ నిర్వాసితులకు రూ.10.24 కోట్ల పరిహారం: మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ నంబర్‌ 10 పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనుల పరిశీలన అనంతరం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన 34 మంది భూ నిర్వాసితులకు రూ.10 కోట్ల 24 లక్షల 40 వేల పరిహారం చెక్కులను మంత్రి తుమ్మల లబ్ధిదారులకు అందజేశారు.

భూమి ఎవరి పేరుపై ఉన్నప్పటికీ, సాగు అనుభవదారులకు పరిహారం అందిస్తామని, సాంకేతిక సమస్యలుంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్‌ లైన్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులు, గోదావరిలో తగ్గుతున్న నీటిమట్టాలను దృష్టిలో ఉంచుకుని కాటన్‌ బ్యారేజ్‌, దుమ్ముగూడెం ఆయకట్టు వద్ద ఇసుక బస్తాలు వేసి రానున్న పది రోజుల పాటు నీటిని నిల్వ ఉంచి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA