Julurpad: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలి చండ్ర నరేంద్ర కుమార్!

Julurpad: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 16 Oct 2026 7:37 PM IST
Julurpad
X

Julurpad: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలి చండ్ర నరేంద్ర కుమార్!

జూలూరుపాడు: ఎల్సినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ మండల కార్యవర్గ సమావేశం సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారని దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. గోదావరి జలాలతో చెరువులను నింపాలని, రైతులకు కరువు పరిహారం తక్షణమే ఇవ్వాలని . కోరారు రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటని అనేక మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. తక్షణం కరువు ప్రాంతంగా ప్రకటించి ఒక్కో ఎకరానికి పరిహారంగా రూ.30 వేలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు అడుగంటాయని భూగర్భ జల నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకుంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కనీసం చేతికి అందిన పంటలనైనా కాపాడేందుకు ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గోదావరి జలాలను అందించే ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత మేరకు గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు.పొరుగురాష్ట్రాలు ఇప్పటికే కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాయని కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని విమర్శించారు పత్తికి కనీస మద్దతు ధర 13000 ఇవ్వాలని కోరారు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని లేనిపక్షంలో పేద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు,sk నాగుల్ మీరా. ఎల్లంకి మధు. పోనేకంటి వెంకటేశ్వర్లు. గుండె పిన్ని మధు సుధన్ రావు, కంచర్ల రాఘవేంద్రరావు వల మల్ల సామేలు హలవత్ బద్రు. కొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU