Bhadrachalam: ఇసుక లారీ బీభత్సం..మాజీ సర్పంచ్ చలపతికి స్వల్ప గాయాలు!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం వద్ద ఇసుక లారీ బైక్‌ను ఢీకొట్టింది. పులిగుండాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత చలపతికి గాయాలు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 22 Sept 2026 5:06 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ఇసుక లారీ బీభత్సం..మాజీ సర్పంచ్ చలపతికి స్వల్ప గాయాలు!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం వద్ద ఇసుక లారీ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. చర్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన చలపతి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులి గుండాల మాజీ సర్పంచ్ తన బైక్ పై భద్రాచలం బయలుదేరారు. భద్రాచలం మీదుగా చర్ల ఇసుక రాంపుకు బయలుదేరిన లారీ ఆ బైక్ ను ఢీ కొట్టింది దీంతో చలపతికి గాయాలు అవటంతో నర్సాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చర్ల దుమ్ముగూడెం భద్రాచలం జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లారీల అతి వేగం, అధిక లోడు, రోడ్లు మొత్తం పాడవడం. మరోపక్క దుమ్ము ధూళి వచ్చి పోయే వాహనదారులకు, స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత కొన్ని రోజులకు ఇసుక లారీలు ఢీకొట్టడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక సంఘటన జరిగి మరువక ముందే మరొక సంఘటన జరుగుతుంది. వచ్చి పోయే వాహనదారులకు ఈ ఇసుక లారీలు మృత్యు శకటాలగా కనిపిస్తున్నాయని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరి ప్రాణాలు పోయినా ఈ లారీలను ఆపే దమ్ము ఎవ్వరికి లేదనే విధంగా ఇక్కడ ఇసుక లారీలు వేగంగా తిరుగుతుంటే తెలుస్తుంది.

ఇక భద్రాచలం పట్టణంలో అయితే ఈ లారీల తోటి ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఆ లారీలు వెళ్లేదాకా రోడ్డు క్రాస్ చెయ్యాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇసుక ర్యాంపు వాళ్లు ఈ లారీలకు గ్యాప్ ఇచ్చి మరీ లోడ్ లోడ్ చేయాలని కోరుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem