Sathupally: సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాట సండ్ర!

Sathupally: సత్తుపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 17 July 2026 10:48 PM IST
Sathupally
X

Sathupally: సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాట సండ్ర!

సత్తుపల్లి: సీతారామ ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గణతేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు శుక్రవారం సాయంత్రం స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు.

ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ ప్రచారం చేస్తుంటే తెలంగాణలో మాత్రం క్రెడిట్ చోరీ జరుగుతుందని ఆయన విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ ఆలోచన మాజీ ముఖ్యమంత్రి దేనని ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ మంత్రులు మధ్య పోటీ నెలకొందని ఒక మంత్రి తెలియకుండా మరో మంత్రి పర్యటనకు రావడం వారి మధ్య కుమ్ములాటకు నిదర్శనమేనని ఆయన పేర్కొన్నారు.

ఎల్‌నీనో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్న తర్వాతే పంపులు ప్రారంభించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు రెండో ఎండాకాలాన్ని తలపిస్తున్నాయని, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏ సర్వే చూసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.సార్ SIR పై పార్టీ ముఖ్య కార్యకర్త లకు అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ పురపాలక సంఘం చైర్మన్ కోసం పూడి మహేష్ జిల్లా గ్రంధాలయం మాజీ అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు శీలపరెడ్డి హరికృష్ణ రెడ్డి ప్రభాకర్ మలికంటి రాము కోటగిరి వెంకటరావు షేక్ రఫీ మోనార్క్

చాంద్ పాషా వల్లభనేని పవన్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story