Kothagudem: అద్దె చెల్లించక ఈఎస్ఐ ఆసుపత్రికి తాళాలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో 15 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఈఎస్ఐ ఆసుపత్రికి తాళాలు వేసిన యజమాని. ఆందోళనలో కార్మికులు.

RAVI, BURGAMPAD AREA
Published on: 25 Sept 2026 10:36 AM IST
Kothagudem
X

Kothagudem: అద్దె చెల్లించక ఈఎస్ఐ ఆసుపత్రికి తాళాలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఈఎస్ఐ ఆసుపత్రిపై అద్దె బకాయిల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. గత 15 నెలలుగా అద్దె చెల్లించలేదన్న కారణంతో భవన యజమాని ఆసుపత్రికి తాళాలు వేసినట్లు సమాచారం.

కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రికే తాళాలు పడటం పట్ల స్థానికులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి అద్దె బకాయిలు పేరుకుపోయే వరకు సంబంధిత అధికారులు ఏం చేశారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అద్దె చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం ఎవరిది. 15 నెలలుగా బకాయిలు ఉంటే అధికారులు ఎందుకు స్పందించలేదు. ఆసుపత్రికి తాళాలు పడే పరిస్థితి వచ్చే వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.

అత్యవసర వైద్యం అవసరమైన సమయంలో ఆసుపత్రి మూసివేయడం వల్ల రోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అద్దె బకాయిల సమస్యను తక్షణమే పరిష్కరించి ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ వైద్య సేవలకే తాళాలు పడితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ಎಂಬ ప్రశ్నలు ఇప్పుడు సారపాకలో వినిపిస్తున్నాయి.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA