Sarapaka: సారపాక ఐటీసీ గేటు వద్ద ఉద్రిక్తత రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!

Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో మధువన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో ధర్నా నిర్వహించారు.

G Ravi, Bhadradri
Published on: 8 Aug 2026 3:17 PM IST
Sarapaka
X

Sarapaka: సారపాక ఐటీసీ గేటు వద్ద ఉద్రిక్తత రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!

Sarapaka:సారపాక ఐటీసీ గేటు వద్ద నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ ఢీకొనడంతో మధువన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది.

మధువన్ మృతితో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఐటీసీ గేటు వద్దకు తీసుకొచ్చి ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మృతుడి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఐటీసీ గేటు వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఐటీసీ గేటు వద్ద భారీ వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ మరోవైపు న్యాయం కోసం మృతదేహంతో రోడ్డుపై కూర్చోవాల్సిన పరిస్థితి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.మధువన్ మృతికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు, బంధువులు స్పష్టం చేశారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story