Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏలో సర్దార్ పటేల్ 151వ జయంతి
Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో బి. రాహుల్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ నిర్వహించారు.
Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏలో సర్దార్ పటేల్ 151వ జయంతి
భద్రాచలం: దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొని ప్రత్యేక రాష్ట్రాల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహెూన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శనివారం నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా జాతి ఐక్యత పై యూనిట్ అధికారులు సిబ్బందితో కలిసి పిఓ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజలంతా ఐక్యతా భావంతో మెలగాలని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం ఉక్కుమనిషి అని, 1875 వ సంవత్సరం అక్టోబర్ 31న నడియాలోని ఒక చిన్న గ్రామంలో జవాన్ బాయ్, లార్డ్ బాయ్ దంపతులకు జన్మించారని, భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సామాజిక రాజకీయ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్.
స్వతంత్ర భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడని, ఆయనను భారతదేశం ఉక్కు మనిషిగా పిలుస్తారని, మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన నాటికి వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా పేరు గడించాడని, ఆ తర్వాత కాలంలో వల్లభాయ్ పటేల్ గుజరాత్ లోని బేడా బొటిష్ బోర్డర్లలో రైతులను బ్రిటిష్ పాలకులు అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా అహింస పూర్వకాల శాసనొల్లంఘటన ఉద్యమంలో సంఘటితం చేసి గుజరాత్లో అత్యంత ప్రభావశీల నాయకులలో ఒకడయ్యారాణి.
మనకు హైదరాబాద్ రాజధానిగా ఏర్పడడానికి వల్లభాయ్ పటేల్ కృషి ఎంతో ఉందని, దేశం కోసం పోరాటాలు జరిపిన మహనీయులను మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన బాటలో నడిచి పదిమందిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, స్వాతంత్ర్యము అనంతరం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలిలో హెూం శాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణిచివేశాడని, 1950 డిసెంబర్ 15న మరణించాడని నాలుగు దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చిందని ఆయన అన్నారు.
అనంతరం ఐటిడిఏ యూనిట్ అధికారులు సిబ్బంది చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ
దేశ ఐక్యతను, సమగ్రతను మరియు భద్రతను కాపాడటానికి నేను అంకితమవుతానని, అలాగే ఈ సందేశాన్ని నా తోటి దేశస్థులలో వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దూరదృష్టి మరియు చర్యల ద్వారా సాధ్యమైన మన దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో నా వంతు సహకారాన్ని అందిస్తానని కూడా నేను దృఢంగా సంకల్పిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి ఆనంద్ కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏసీ ఎం ఓ రమేష్, ఏ డి యం హెచ్ ఓ సైదులు, ఏ పీ ఓ పవర్ వేణు, పిఈటిసి ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, ఎల్ టి ఆర్ డిటి మణిధర్,ఏటీడీవో రాధమ్మ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ కార్యాలయంలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




