Mulakalapalli: తుపాను బాధిత రైతులకు అండగా ఉంటాం.. సర్పంచ్ భరోసా!
Mulakalapalli: మోరసు తుపాను ప్రభావంతో ములకలపల్లి మండలంలో నీటమునిగిన పంట పొలాలను సర్పంచ్ మడకం రవి, వ్యవసాయ విస్తరణ అధికారి పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.
Mulakalapalli: తుపాను బాధిత రైతులకు అండగా ఉంటాం.. సర్పంచ్ భరోసా!
Mulakalapalli: మోరసు తుపాను ప్రభావంతో పోగళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు తీవ్రంగా పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన వరి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము తదితర పంటలు నీటమునిగాయి. దీంతో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం పోగళ్లపల్లి గ్రామ సర్పంచ్ మడకం రవి, వ్యవసాయ విస్తరణ అధికారి రాహుల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్షాల కారణంగా నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మడకం రవి మాట్లాడుతూ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. కష్టకాలంలో రైతులు అధైర్యపడవద్దని, బాధిత రైతులకు గ్రామ పంచాయతీ తరఫున అండగా ఉంటామని పేర్కొన్నారు.




